CTR: చిత్తూరులోని స్థానిక పీసీఆర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. RTC బస్సు, బైకు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని, బైకు దెబ్బతిందని వారు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.