KMM: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇది దుబాయ్ ఫెస్టివల్‌ను మించేలా ఉంటుందన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీ, గచ్చిబౌలి స్టేడియం వంటి వేదికలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.