AP: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇవాళ కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజారోహణ ఘట్టం వైభవంగా నిర్వహించనున్నారు. దీంతో తొమ్మిది రోజుల ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు రాత్రి పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై ఆశీనులై తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.