WNP: వయోవృద్ధుల సంరక్షణ చట్టం2007 ప్రకారం వృద్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఫిర్యాదు చేసిన తక్షణమే తగిన న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తెలిపారు. ఇవాళ వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఈ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె వెల్లడించారు.