HYD: పాతబస్తీ కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ వద్ద అతివేగంగా వచ్చిన కారు (TS 12 C 8502) 8 సంవత్సరాల అమెర్ అలీ అనే మైనర్ బాలుడిని ఢీకొట్టింది. అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.