SRD: గ్రామాల్లో ప్రతి మహిళను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం సిర్గాపూర్ IKP ఆఫీస్లో పొదుపు సంఘాలు మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన ఉన్నతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఇందులో ఏపీఎం సరిత ఉన్నారు.