విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం అన్నారు.