NLG: పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరెట్లో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సమీక్షించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లర్లు పత్తిని కొనుగోలు చేయాలన్నారు. రైతులు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.