SDPT: ఖమ్మంలోని ఎన్.ఎస్.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని చంద్రిక రాసిన ‘కథా చంద్రిక’ బాలల కథల పుస్తకానికి ‘పెందోట’ పురస్కారం లభించింది. శ్రీవాణి సాహిత్య పరిషత్తు, పెందోట బాలసాహిత్య పీఠం (సిద్దిపేట) ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగిన బాల సాహిత్య సమ్మేళనంలో చంద్రికకు నగదు బహుమానం అందజేశారు.