ASF: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా చలి ప్రభావం సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఇళ్ల వద్ద మంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.