ప్రకాశం: పామూరు మండలంపై మొంథా తుఫాన్ ఏ మేరకు ప్రభావం చూపిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో స్థానిక రెవిన్యూ యంత్రాంగం, పోలీస్ సిబ్బంది నిర్వర్తించిన విధులపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అందుకే మండలానికి చెందిన ఎంపీడీవో, ఎస్సై పలువురు అధికారులకు నిన్న ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ప్రశంసా పత్రాలు అందజేశారు.