NLG: నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రు ఏరియా దవాఖానను జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులలో చేరి జ్వరం, చలితో బాధపడుతున్న పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పిల్లల ఆరోగ్య స్థితిని డీసీహెచ్ఎస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులందరికీ ఉత్తమ సేవలు అందిస్తామని వారి తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు.