W.G: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం పెదలంకలో జరిగింది. దీనిని నియోజకవర్గ ఇంఛార్జ్ గూడాల గోపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్థులతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. అనంతరం గ్రామ, మండల, అనుబంధ విభాగాల కమిటీల నియామకం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.