పెద్దపల్లి: పాలకుర్తి మండలం వేంనూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నాలుగో చతుర్థ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. కుక్కలగూడూరు శ్రీ అమృత లింగేశ్వర శివాలయం నుండి స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, మహోత్సవం తలంబ్రాలు, పండ్లు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.