SKLM: జామియా మసీదు అభివృద్ధికి నూతన వక్ఫ్ బోర్డ్ కమిటీ కృషి చేయాలని, అందుకు అవసరమైన సాకారం అందిస్తామని ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో స్థానిక జామియా మసీద్ ప్రాంగణంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఇవాళ నిర్వహించారు. మసీదు పరిసర ప్రాంతాలలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసేందుకు జేసీబీని ఉపయోగించి పనిని తక్షణమే ప్రారంభిస్తామని తెలియజేశారు.