TG: రామోజీరావు సిబ్బందిలో బృంద స్ఫూర్తిని నింపేవారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. రామోజీ ఓ కుగ్రామం నుంచి వచ్చి ఎంతో గొప్పస్థాయికి చేరారని తెలిపారు. ఆలోచనలను సంస్ధలుగా తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. సమాజానికి స్ఫూర్తిగా నిలవడమే ఓ గొప్ప విజయమన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా రామోజీ స్పందించేవారని చెప్పారు.