W.G: అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పోడూరు మండల టీడీపీ ముఖ్య శ్రేణుల సమావేశం ఆదివారం పోడూరులో జరిగింది. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో చేసిన మంచి పనులను గడపగడపకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. వైసీపీ గత ఐదేళ్లు నియంతృత్వ, నిరంకుశ, కక్షలు, వేధింపులు, కేసులతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు.