రేపు కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం. ఈ రోజున భక్తిశ్రద్ధలతో శివారాధన చేయడం ద్వారా కోటి సోమవారాల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం చేయించడం, బిల్వ పత్రాలు సమర్పించడం చాలా శుభప్రదం. ఇంటి వద్ద అయితే, పరమశివుడికి దీపారాధన చేస్తే శివానుగ్రహం లభించి, మనోభీష్టాలు నెరవేరుతాయి.