‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 71 ఏళ్ల వృద్ధురాలిని నకిలీ కోర్టు ఉత్తర్వులతో బెదిరించి రూ.49 లక్షలు దోచుకున్న ఒక పెద్ద గ్యాంగ్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. వ్యక్తిగత వివరాలు మోసాల్లో వాడబడ్డాయని భయపెట్టి, పిల్లలను అరెస్ట్ చేస్తామని బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ కేసులో లక్నోలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.