GDWL: రాష్ట్ర డీజీపీ చేపట్టిన రోడ్డు ప్రమాదాలపై ప్రజలను చైతన్యం చేసే ‘ఏ రైవ్ ఏ లైవ్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. మద్యం తాగి రహదారులపైకి వచ్చే వారి వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అయితే జిల్లా మొత్తం ఈ తనిఖీలు చేపడతామన్నారు.