CTR: రాష్ట్ర పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మిక వేదికగా విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజులు పాటు జరిగిన సమ్మిట్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు CM చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలమన్నారు.