WNP: తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సమ్మె కారణంగా ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోలు ప్రక్రియను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రైతులు పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు, మార్కెట్ యార్డులకు తీసుకురావద్దని వనపర్తి జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.