TG: పచ్చళ్లు తినిపించినా, పత్రిక చదివించినా రామోజీరావు గొప్పదనం కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పొంతన లేని వివిధ రంగాల్లో ఒకే వ్యక్తి రాణించడం చాలా కష్టమన్నారు. రామోజీ పేరు కాదని ఒక బ్రాండ్ అని కొనియాడారు. ఈ బ్రాండ్‌ను కొనసాగించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.