AP: రామోజీరావు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని తెలిపారు. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారన్నారు. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకునిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా ఆయన చెరగని ముద్ర వేశారన్నారు.