JGL: మేడిపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో నిర్వహించిన తులసి దామోదర కళ్యాణ మహోత్సవం, కార్తీక మాస వన భోజనాలల్లో ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.