ELR: కార్తీక మాసంలో వన భోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు యువత ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. కార్తీకమాసం వన భోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భోజనాలు వడ్డించారు. ముందుగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.