SRD: సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన విమార్ట్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాహకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.