ATP: తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ ఐదో రోడ్డులో వెలసిన శ్రీ శివసాయి మందిరం సాయిబాబా ఆలయానికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తమ సొంత ఖర్చులతో ఆట వస్తువులు విరాళంగా ఇచ్చారు. దాదాపు రూ. 5 లక్షల విలువైన ఈ వస్తువులు ఆలయానికి వచ్చే భక్తుల పిల్లల సౌకర్యార్థం అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.