ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి ఆలయంలో మహా పుష్ప యాగం సందర్భంగా ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాట భజనలు భక్తులను విశేషంగా అలరించాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.