GDWL: జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా గుర్తిస్తే స్థానిక పీఎస్‌కి సంప్రదించాలన్నారు.