TPT: తిరుమల శ్రీవారిని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశ్వీరాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.