PPM: ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ (UPSC) కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తులు చేసుకొవాలన్నారు.