MBNR: మహబూబ్నగర్ మండలం మంచన్పల్లి తండాకు చెందిన రాజేశ్వరి చెవెళ్లలోని ఓ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆదివారం రూ.25 వేల చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నువ్వు డాక్టర్ అయ్యాక ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.