PPM: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగులు వేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుశగ్రామంలో వాటర్ ఫాల్స్, పరిసర ప్రాంతాలలో ఆదివారం ఆయన ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు.