KNR: హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ ఆదివారం జమ్మికుంట పట్టణంలో డ్రోన్ స్ప్రే నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు డ్రోన్ స్ప్రేయింగ్ ప్రయోజనాలను వివరించాలని నిర్వాహకులను ఆయన కోరారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభాదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రణవ్ పేర్కొన్నారు.