KMR: లింగంపేట్లోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ.. పర్మల్ల గ్రామం నుంచి లింగంపేటకు ఇసుక తీసుకెళ్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.