CTR: విశాఖలో నిర్వహించిన సీఐఐ సమ్మిట్‌తో ఆంధ్రప్రదేశ్‌పై గ్లోబల్ దృష్టి మళ్లిందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా మార్చడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మరోసారి తమ ప్రావీణ్యాన్ని నిరూపించారని తెలిపారు. వీరి కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుందని, చిత్తూరు జిల్లాకు మంచి రోజులు వస్తాయని అన్నారు.