TG: రామోజీ అవార్డుల ఆలోచన చేసిన కుటుంబసభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రామోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని వారు భావించడం ప్రశంసనీయం అన్నారు. రామోజీరావు సంస్థల నిర్వహణ ఆషామాషీ కాదన్నారు. రామోజీరావు సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయని కొనియాడారు. తెలంగాణకు నాలుగో అద్భుతంగా రామోజీ ఫిల్మ్‌సిటీ నిలిచిందని వెల్లడించారు.