KRNL: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు.