KMM: సత్తుపల్లి మండలం రామానగరంలో బేతుపల్లి చెరువుకు కాపలాదారుడిగా ఉన్న పిల్లి ఆనందరావు (36) అనే వ్యక్తి ఆదివారం ప్రమాదవశాత్తు చెరువులో కాలుజారి పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అతడిని వెలికితీశారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.