KMM: బీసీ రిజర్వేషన్ బిల్లులో మూడు పార్టీలు మూడు ముక్కల ఆట ఆడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. KCR హయాంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వెల్లడించారు.