VZM: డెంకాడ మండలం చింతలవలసలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కార్తీకవన సమారాధన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కార్తీక మాసం ఆధ్యాత్మికత, సంప్రదాయాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. సమాజ అభివృద్ధికి పద్మశాలీల సంఘం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.