ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తెరకెక్కింది. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, ఒక రోజు ముందే.. అంటే ఈనెల 27 నుంచి వరల్డ్ వైడ్గా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు రామ్ కన్ఫర్మ్ చేశాడు. కాగా, ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.