VSP: గోపాలపట్నం సింహాచలం వెళ్లే రహదారిలో డిఫెన్స్ మద్యాన్ని కలిగి వున్నా రామ్మోహన్ రావు అనే వ్యక్తిని పెందుర్తి ఎక్సైజ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం పవన్ రెసిడెన్సులో నివాసం ఉంటున్న రామ్మోహన్రావు రూ.40,000 విలువ చేసే 40 డిఫెన్స్ మద్యం బాటల్లు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.