SKLM: కొత్తూరుకి చెందిన ధర్మేందర్ కుమార్ రాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (INICET)లో ఆల్ ఇండియా స్థాయిలో 992వ ర్యాంకు సాధించారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆయనకు ఈ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకుతో AIIMS సీటు సంపాదించారు. వెన్నెలవలస నవోదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ధర్మేందర్, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని అన్నారు