AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో వివాదం నెలకొంది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామని తేల్చి చెప్పింది. యాజమాన్యం తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.