ప్రకాశం: కనిగిరి మండలంలోని జమ్మలమడక గ్రామంలో వైసీపీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గ్రామస్తుల నుండి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దన్నారు.