విశాఖ జగదాంబ థియేటర్లో శివ రీ రిలీజ్ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరుపుకున్నారు. నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సీనియర్ హీరోల రీ రిలీజ్ చిత్రాల్లో రికార్డు సృష్టించింది. క్రాంతి పిక్చర్స్ రామకృష్ణారెడ్డి, జగదాంబ థియేటర్ జగదీష్బాబుకి మెమెంటోలు అందజేశారు.