BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి (కే) గ్రామ శివారులోని కెనాల్ వద్ద గంజాయి అమ్ముతున్న ముగ్గురిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. CI కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. SI దివ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీల్లో 2.3 కేజీల ఎండు గంజాయి, 53 చాక్లెట్లు, మూడు మొబైల్స్ స్వాధీనం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించారు.