W.G: పేరుపాలెం బీచ్‌కు మద్యం తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి హెచ్చరించారు. ఆదివారం పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లకు వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన బీరును యువకులతో పారబోయించారు. అనంతరం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపటం, సముద్రంలో స్నానం చేయడంతో జరిగే ప్రమాదాలను వివరించారు.